ప్రతిపక్షం, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. జాతిపిత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
మహాత్మా గాంధీ దార్శనికత, కృషి నుంచి దేశ ప్రజలు ఎల్లప్పుడూ స్ఫూర్తి పొందుతూనే ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు.
ప్రతి భారతీయుడి పురోగతే లక్ష్యంగా పనిచేస్తామని మోదీ తెలిపారు. భారత్‌ను మరింత ప్రగతిశీల, సుసంపన్న దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.





























