వచ్చే ఎన్నికల్లో కేటీఆర్‌కు ఓటమి తప్పదు.
భూ దోపిడీ, ఇసుక అక్రమ వ్యవహారాలను ప్రజలు మర్చిపోరు.
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్‌రావు
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 29: సిరిసిల్లలో ఈ నెల 30న జరగనున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కాబోతుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. సభకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారని తెలిపారు. సిరిసిల్ల సభ నేపథ్యంలో కేటీఆర్‌కు వణుకు మొదలైందని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. మంగళవారం రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో భూ దోపిడీ, ఇసుక అక్రమ వ్యవహారాలు, అనేక ఆగడాలు చోటుచేసుకున్నాయని రాజేందర్‌రావు ఆరోపించారు. గత పాలనలో జరిగిన పరిణామాలను ప్రజలంతా గమనిస్తు న్నారని అన్నారు. సిరిసిల్ల సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభతో బీఆర్‌ఎస్ పార్టీకి ఇక కౌంట్‌డౌన్ ప్రారంభమైందని, ఆ పార్టీకి నూకలు చెల్లినట్లేనని వ్యాఖ్యానించారు.
కరీంనగర్ నుంచి భారీగా తరలిరావాలి
సిరిసిల్ల సభను విజయవంతం చేసేందుకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాజేందర్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కదిలి సభను విజయవంతం చేయాలని కోరారు. గత పాలనలో జరిగిన భూ, ఇసుక వ్యవహారాలు ఆగడాలను ప్రజలు మర్చిపోలేదని రాజేందర్‌రావు అన్నారు. సిరిసిల్ల సభకు ప్రజల నుంచి వస్తున్న స్పందన మార్పుకు సంకేతమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే సభకు కరీంనగర్ నుంచి భారీగా తరలివెళ్లి కాంగ్రెస్ బలాన్ని చాటాలని ఆయన కోరారు.





























