శంకర్ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 10: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.మెదక్ పట్టణంలోని 21వ వార్డు ఫతేనగర్‌కు చెందిన మాసాయిపేట శంకర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. శంకర్ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సాయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రమోహన్ గౌడ్, మహేష్, అజ్గర్, పంపరి శీను, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

























