ప్రతి పక్షం కథనానికి స్పందన – పంచాయతీ కార్యదర్శి, కంప్యూటర్ ఆపరేటర్‌కు మెమోలు జారీ

*ఎంపీడీవో ఆఫీసులో వసూళ్ల రాజ్యం కథనంపై ఎంపీడీవో యాదగిరి చర్యలు.

*సంజాయిషీ ఇవ్వాలని ఎంపీడీవో ఆదేశం.

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 18 : చండూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులకు, పనులు చేసే గుత్తేదారులకు _బిల్లులు, చెక్కులు పాస్ కావాలంటే ” ఎంపీడీవో ఆఫీసులో వసూళ్ల రాజ్యం “అని శీర్షికన ”ప్రతి పక్షం” లో వచ్చిన కథనానికి ఎంపీడీవో బండారు యాదగిరి స్పందించారు.వచ్చిన వార్తపై వివరణ ఇవ్వాలంటూ గుండ్రపల్లి కార్యదర్శి నాగ ప్రగ్న, కంప్యూటర్ ఆపరేటర్ రాజారాం కు శనివారం మెమోలు జారీ చేశారు. ఆరోపణలపై సంజాయిషీ ఇవ్వాలని మెమోలో పేర్కొన్నారు.

*కథనం చర్చనీయాంశం…
ఇదిలా ఉండగా ప్రతి పక్షం లో వచ్చిన కథనం అంతటా చర్చనీయాంశంగా మారింది. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో కాంట్రాక్టులు చేసే గుత్తేదారులు సైతం ప్రతి పక్షంలో వచ్చిన కథనం ముమ్మాటికీ నిజమని, ఇన్వెస్టిగేషన్‌తో వార్త రాయటంపై ప్రతి పక్షం పై ప్రశంసలు కురిపించారు.

*ఉన్నతాధికారుల ఆరా…
ఉన్నతాధికారులు సైతం ఒక్క చండూరే అని కాకుండా మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.ప్రతి పక్షం కథనంతో ఎంపీడీవో కార్యాలయంలో కలకలం రేపింది. అవినీతికి పాల్పడే సిబ్బందిపై మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News