తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి.

*ఉద్యమకారులకు ఇంటి స్థలాలు, పింఛన్లు తక్షణమే అందించాలి.
*మలిదశ ఉద్యమకారులకు అండగా నిలవాలి.
*మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వినతి.

ప్రతి పక్షం చౌటుప్పల్ నవంబర్ 11: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇంటి స్థలాలు, పింఛన్లు, హెల్త్ కార్డులను తక్షణమే అందజేసేలా చర్యలు తీసుకోవాలని చౌటుప్పల్ ప్రాంత ఉద్యమకారులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోరారు.ఈ మేరకు చౌటుప్పల్ ప్రాంత తెలంగాణ ఉద్యమకారులు బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల కోఆర్డినేటర్ కట్టెల లింగస్వామి మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేకమంది ఉద్యమకారులు నేటికీ ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ఉద్యమకారులందరికీ ఇంటి స్థలాలు, నెలవారీ పింఛన్, ఉచిత హెల్త్ కార్డులు అందేలా అసెంబ్లీలో మాట్లాడి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.

*ఎమ్మెల్యే సానుకూల స్పందన:
ఉద్యమకారుల వినతిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల త్యాగాలు మరువలేనివని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ప్రాంత ఉద్యమకారులు ఉప్పు కృష్ణ, పకీరు శ్రీనివాస్ రెడ్డి, పెద్దగోని రమేష్ గౌడ్, మహమ్మద్ ఇబ్రహీం, రిక్కల ప్రవీణ్ రెడ్డి, జాల మల్లేష్, ఎస్కే మున్నా, గరిశ మహేష్, అంజనా చారి, సంగిశెట్టి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News