ఉద్యమంలోనూ.. ఉద్యోగంలోనూ నిబద్ధతతో సేవలు
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 05: తెలంగాణ ఉద్యమంలో జెల్ల సుధాకర్ అందించిన సేవలు అభినందనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. ఉద్యమంలోనూ, ఉద్యోగంలోనూ నిబద్ధతతో పనిచేసిన సుధాకర్ సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించి ఇటీవల పదవీ విరమణ పొందిన జెల్ల సుధాకర్‌ను కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధాకర్‌కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుధాకర్ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జెల్ల సుధాకర్ అందించిన సేవలు, చూపిన నిబద్ధత అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా కూడా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి మాత్రమే ముగింపు అని, సామాజిక జీవితంలో మరింత చురుకుగా కొనసాగేందుకు ఇది మరో కొత్త ఆరంభమని అన్నారు. సుధాకర్ దంపతులు ఇకపై కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యరెడ్డి, టీఎన్జీవో మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్యామ్‌రావు, మాజీ కౌన్సిలర్ మల్లేశం, నాయకులు చంద్రమోహన్ గౌడ్, జగదీష్, గంజి నవీన్, నాగరాజు, కిరణ్ గౌడ్, స్వామి నాయక్, రామారావు తదితరులు పాల్గొన్నారు.





























