ప్రతిపక్షం, ఆగస్టు 07: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢా వైద్య రంగంలో డాక్టర్లు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌ల మధ్య జరుగుతున్న రిఫరల్ వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వైద్యులు, ల్యాబ్‌ల మధ్య ఉన్న ఒప్పందాలు రోగులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆయన విమర్శించారు.
రాజ్యసభలో మాట్లాడిన ఆయన, రిఫరల్ వ్యవస్థ ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. కొందరు వైద్యులు ల్యాబ్‌లకు రోగులను పంపించి కమిషన్లు పొందుతున్నారని, దీని ప్రభావం నేరుగా రోగుల బిల్లులపై పడుతోందని పేర్కొన్నారు.
ఈ కారణంగా వైద్య ఖర్చులు 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతున్నాయని, అవసరం లేకపోయినా పలు వైద్య పరీక్షలు సూచిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

















