[t4b-ticker]

E20పై కేజ్రీవాల్ పోరు.. నేడు మోదీ ఇంటికి పాదయాత్ర!

ప్రతిపక్షం, ఆగస్టు 04: E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించేందుకు సుమారు 100 మంది ప్రతినిధులతో కలిసి వెళ్లనున్నట్లు తెలిపారు.

అమెరికా నుంచి ఇథనాల్ కొనుగోలు చేయాలన్న ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని E20 విధానాన్ని పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే ఈ పాదయాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. దీంతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, E20 విధానంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Spread the love

Related News

Latest News