[t4b-ticker]

కాంగోలో ఎబోలా కలకలం.. 3,800కుపైగా కేసులు, 1,700 మంది మృతి

ప్రతిపక్షం, ఆగస్టు 04: ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే 15 నుంచి ఇప్పటివరకు 3,802 అనుమానిత, నిర్ధారిత కేసులు నమోదుకాగా, 1,700 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో 100 మందికిపైగా ఆరోగ్య సిబ్బంది ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

ఈ వ్యాప్తికి బుండిబుగ్యో ఎబోలా వైరస్ కారణమై ఉండొచ్చని ఆరోగ్య అధికారులు గుర్తించారు. ఈ వైరస్‌కు ప్రస్తుతం సమర్థవంతమైన టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

వ్యాధి నియంత్రణ కోసం బాధితులను గుర్తించడం, ఐసోలేషన్ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలను కాంగో ప్రభుత్వం ముమ్మరం చేసింది. వైరస్ మరింత వ్యాపించకుండా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల సహకారంతో పర్యవేక్షణ కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News