ఒక్క వరుడికి ముగ్గురు యువతులు.. వైరల్ పెళ్లి వెనుక అసలు కథ ఇదే!

ప్రతిపక్షం, జూలై 27: ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒకే యువకుడిని ముగ్గురు యువతులు వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో సంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలో వరుడు ముగ్గురు యువతులతో సప్తపది నడవడం, సింధూరం దిద్దడం వంటి దృశ్యాలు వైరల్ కావడంతో దీనిపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

వైరల్ వీడియోలో కనిపించిన యువతులు సరోజ్, సావిత్రి, సంతోష్‌గా గుర్తించారు. వీరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా, మరొకరు వారి బంధువు. వరుడిగా కనిపిస్తున్న వికాస్ గత కొంతకాలంగా వారి సోషల్ మీడియా వీడియోల్లో నటిస్తున్న వ్యక్తి. మొదట ఈ పెళ్లి కేవలం కంటెంట్ కోసమే చిత్రీకరించిన వీడియో అని భావించిన నెటిజన్లు, అనంతరం వారు స్వయంగా ఇది నిజమైన వివాహమేనని చెప్పడంతో మరింత చర్చకు దారితీసింది.

యువతుల ప్రకారం, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము పెళ్లి తర్వాత విడిపోవడం ఇష్టంలేక ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుటుంబాలు వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యామని, కలిసి జీవించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తమపై ట్రోలింగ్, అవమానకర వ్యాఖ్యలు చేయవద్దని సోషల్ మీడియా వినియోగదారులను కోరారు.

ఇదిలా ఉండగా, ఈ వివాహం చట్టబద్ధతపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Spread the love

Related News

Latest News