ప్రతిపక్షం, ఆగస్టు 21: ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు నడిగర్ సంఘం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు నాజర్ వెల్లడించారు.
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి ఎన్నో దశాబ్దాల పాటు నటిగా కొనసాగారు. సహజమైన నటన, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ఆదరణ పొందారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు పలు భాషల్లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
సీనియర్ నటిగా కొత్త తరానికి కూడా స్ఫూర్తిగా నిలిచిన ఆమె.. వయసు పెరిగినా నటనకు దూరం కాలేదు. తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఆమె మరణవార్తతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు షావుకారు జానకి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





























