ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 30: ప్రజా పాలన ప్రారంభమయ్యే సమయానికి ఉద్యోగులకు జీతభత్యాలు ఒకటో తేదీన ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. జీతభత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పదోన్నతులు, బదిలీలు, ఆరోగ్య భద్రత కార్డులు వంటి ఉద్యోగుల సమస్యలను ఉద్యోగుల సహకారంతో పరిష్కరిస్తున్నామని అన్నారు. సమస్యలు మొత్తం పరిష్కారం కాకపోయినా ప్రజలకు సేవలు అందిస్తూనే తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్రంలో పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర మార్గాల ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు పదిన్నర లక్షల మంది ఉన్నారని, వారు నాలుగు కోట్ల ప్రజలకు సేవలు అందిస్తున్నారని సీఎం తెలిపారు.సుమారు మూడు శాతం మంది ఉద్యోగులు 97 శాతం ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఇది ఎంతో నిష్ఠ, శ్రమతో కూడుకున్న బాధ్యత అని అన్నారు.

Spread the love

Related News

Latest News