*గుండ్రపల్లి సర్పంచ్ ఉజ్జిని ఉష అనిల్ రావు.
ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 16: గ్రామపంచాయతీ సిబ్బంది రుణం జీవితం ఉన్నంతవరకు తీర్చుకోలేనిదని గుండ్రపల్లి సర్పంచ్ ఉజ్జిని ఉషఅనిల్ రావు అన్నారు. దసరా పండుగ సందర్భంగా చండూరు మండలం పరిధిలోని గుండ్లపల్లి గ్రామపంచాయతీ వద్ద గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మికులకు దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నిత్యావసర సరుకులు పట్టలను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉజ్జినిఉష అనిల్ రావు మాట్లాడుతూ , గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సేవ అత్యంత విలువైనదని అన్నారు. వారి రుణాన్ని మన జీవితం ఉన్నంత వరకు తీర్చుకోలేమని అన్నారు. అదేవిధంగా ఎవరికి వారు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్మికుల కృషిని గుర్తించి, పండుగ సంతోషంగా గడపాలని కోరుతూ బట్టలు మరియు నిత్యావసర సరుకులు అందించినట్లు తెలిపారు. వారికి నూతన వస్త్రాలు సబ్బులు, సర్ఫ్ కొబ్బరి నూనె,మాస్కులు పంపిణి చేయడం జరిగింది.సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ ఉపసర్పంచ్ టేకుల వినోద్ రెడ్డి వార్డ్ మెంబర్స్ పెండ్యాల నిర్మల్ రావు,వడ్డమల్ల మధు,తిరుమణి శ్రీనివాస్,భూషిపాక మంగమ్మ అంజి, పోలేని రేణుక పరమేశ్, పంచాయతీ కార్యదర్శి సాయి ప్రజ్ఞ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.





























