మర్పడగలోని విజయ దుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు
సిద్ధిపేటలో దుర్గామాత మండపాల సందర్శన
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 15: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పలు ఆలయాలను, దుర్గామాత మండపాలను సందర్శించారు. మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సిద్ధిపేట పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సిద్ధిపేట నియోజక వర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
































