మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ..

•ఇందిరా గాంధీ కుటుంబమే దేశాన్ని పరిపాలించాలనే మోదీపై ఈర్ష

•దేశ మార్పునకు విశేషంగా కృషి చేస్తున్న ప్రధాని మోదీ

•వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి భారతీయుడి భాగస్వామ్యం అవసరం

•బిజెపి జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు డి. నారాయణ

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 07, ప్రతిపక్షం: గుజరాత్ ముఖ్యమంత్రిగా,అనంతరం దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ నిరంతరాయంగా 25 ఏళ్లపాటు దేశానికి ప్రజాసేవ అందించారని… అది జిర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ కుటుంబమే దేశాన్ని పరిపాలించాలని ఈర్షతో ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తుందని బిజెపి జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి ఆరోపించారు.బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా 25 ఏళ్ల ప్రజా సేవ పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో “వికసిత్ భారత్ సంకల్ప సభ” ఘనంగా నిర్వహించారు.బిజెపి జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి సభను బీజేపీ కార్యకర్తలతో కలిసి వీక్షించారు.సభా అనంతరం సేవ పెద్ద ఎత్తున కార్యకర్తలతో “సేవా జ్యోతి కలశ యాత్ర”లో సామాజిక సేవకులు చేయూత ఆశ్రమ వ్యవస్థాపకులు విట్టా శ్రీనివాస్ రెడ్డిచే కలశ జ్యోతి ప్రారంభించి యాత్ర నిర్వహించారు.సేవ జ్యోతి యాత్రలో బిజెపి జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి కాగడాలతో రాజీవ్ చౌరస్తా నుంచి రామాలయం వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజలచే ఎన్నుకోబడి, అత్యంత సుదీర్ఘ కాలం ప్రధానిగా నరేంద్ర మోదీ సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. దేశ మార్పునకు విశేషంగా మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తి పెంచారని, ఉగ్రదేశాల కుట్రలను, శత్రువుల దాడులను ఎదుర్కొని, గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. భారతదేశ ప్రజలు మళ్లీ మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండాలని, ప్రజలు గెలిపిస్తున్నారని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీని ఢీకొనేవారు ఎవరూ లేరన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న మోదీ సంక‌ల్పంలో దేశ ప్రజలందరు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.దేశ అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భగవంతుడు దీర్ఘాయుష్షును, శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కునే శక్తిని, ప్రసాదించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి వారి కుటుంబం తప్ప ఎవరు దేశాన్ని పాలించవద్దని ఈర్షతోనే కేంద్ర ప్రభుత్వంపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ పాలన చూసి వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ:బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణలు

గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ నిరంతరాయంగా 25 ఏళ్లపాటు అందించిన ప్రజాసేవ దేశానికి స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ కొనియాడారు.ఈ సందర్భంగా ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం తదితర రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మోదీ సేవా స్ఫూర్తికి కృతజ్ఞతగా సేవా జ్యోతి కలశం యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే సేవా జ్యోతి కేవలం ఒక కార్యక్రమం కాదని.. సేవ, త్యాగం, అంకితభావం, నిబద్ధతకు ప్రతీకగా నిలిచే జాతీయ సంకల్పమని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి, సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి,జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి,సబి రెడ్డి వెంకట్ రెడ్డి,మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి, బి.శ్రీశైలం, వెంకటేశ్వర రెడ్డి, కేతూరి బుడ్డన్న, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, పెద్దిరాజు, వి.కల్పన, కోశాధికారి బి. కుమారస్వామి, సీనియర్ నాయకులుఏ.సీతారాములు, చిత్తారి ప్రభాకర్,సుమిత్రమ్మ, ముఖ్య నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News