మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన.
కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి వీరాచారి.
ప్రతిపక్షం. హుస్నాబాద్. నవంబర్ 21: కరీంనగర్ లోని కేంద్రమంత్రి బండి సంజయ్ నివాసంలో కలిసి మహా పాదయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. దేశ సమగ్రతను, ప్రజాస్వామ్యన్ని ఇండికూటమి, కాక్రోచ్ జనతా పార్టీలు దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నాయని వీరాచారి ఆరోపించారు. సర్ పై విష ప్రచారాన్ని తిప్పి కొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు బిజెపి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 40 పార్లమెంట్ సెగ్మెంట్ లలో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నరన్నారు. అందులో భాగంగా ఈ నెల 23న కరీంనగర్ లో లక్ష మందితో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మహా పాదయాత్ర నిర్వహించనున్నారని వెల్లడించారు. ఈ పాదయాత్రలో హుస్నాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




























