ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ లను BC-D నుండి BC-A లకు కలపడాని వ్యతేరేకిస్తు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా.జిల్లా అధ్యక్షులు సంఘస్వామి పట్టణ అధ్యక్షులు చౌదరి మల్లేశం యూత్ ప్రెసిడెంట్ చౌదరి నవీన్, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయ ఆర్థిక రంగాలలో ముందంజలో ఉన్నారు ముదిరాజ్ కులస్తులను బిసి ఏలోకి మార్చడం సరైనటువంటి విధానం కాదని అన్ని రంగాలలో ఎదిగిన ముదిరాజులను బలహీనంగా ఉన్న బీసీఏ లోకి మార్చడం సరైనటువంటి విధానం కాదని వారి ఆరోపించారు.
ఇప్పటికే ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన వారిని బీసీ ఏ లో ఉన్నారని ఆర్థికంగా రాజకీయంగా ముందు ఉన్న ముదిరాజులను బీసీ ఏలోకి మార్చడం అంటే బీసీఏ ఎలా ఉన్నా ఇతర కులస్తులను అణిచివేయడం ద్వారా ఆరోపించారు. ఒకవేళ బిసి ఏలోకి మారిస్తే రజక సంఘం ఆధ్వర్యంలో ఏ గ్రామాలలో పట్టణాలలో రజక సంఘం కులవృత్తి నిలిపివేయడం జరుగుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోమెదక్ జిల్లా రజక సంఘం నాయకులు జనార్దన్బకవరి శివ, సంతోష్, గణేష్, మహేష్, శివ, వెంకటేష్, నారాయణాయ,అభిలాష్, సంపత్, రాజు, రాహుల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
































