[t4b-ticker]

ఆగస్టు 16లోగా ఈ-కేవైసీ పూర్తి చేయండి.. లేదంటే గ్యాస్ కనెక్షన్, సబ్సిడీ నిలిచే అవకాశం

ప్రతిపక్షం, ఆగస్టు 07: గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి స్పష్టం చేశాయి. నిర్ణీత గడువులోపు ఈ-కేవైసీ చేయని వినియోగదారుల గ్యాస్ కనెక్షన్‌తో పాటు సబ్సిడీ నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరించాయి.

ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఆ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదని కంపెనీలు తెలిపాయి. అయితే ఇంకా పూర్తి చేయని వారు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించాయి.

ఈ-కేవైసీని సమీప గ్యాస్ ఏజెన్సీ, గ్యాస్ డెలివరీ సిబ్బంది సహాయంతో లేదా సంబంధిత గ్యాస్ కంపెనీల ఆన్‌లైన్ సేవల ద్వారా సులభంగా పూర్తి చేసుకోవచ్చని వివరించాయి. వినియోగదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News