•భూ వివాదాల పేరుతో బెదిరింపులు, దౌర్జన్యాలు, మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు
•ప్రజావాణిలో 25 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి
ప్రతిపక్షం,జులై 27,వనపర్తి ప్రతినిధి: భూ వివాదాలు సివిల్ స్వభావం కలిగినవని, వాటికి శాశ్వత పరిష్కారం కోర్టు ద్వారానే సాధ్యమని,భూ వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, బెదిరింపులు, దౌర్జన్యాలు లేదా మోసాలకు పాల్పడితే పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి హెచ్చరించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా 25 ఫిర్యాదులు ఆమె స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, వేగవంతమైన స్పందనతో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.పోలీసుశాఖ ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ. సునీత రెడ్డి తెలిపారు. ప్రజావాణిలో 18 – భూతగాదాలు,01 – భార్యభర్తల పిర్యాదులు,06 – పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.

















