[t4b-ticker]

నానో యూరియా, నానో డీఏపీ ప్రయోజనాలపై రైతులకు అవగాహన కార్యక్రమం

*కుమ్మందానిగూడెం గ్రామంలో నానో ఎరువులపై ఆత్మ క్షేత్ర ప్రదర్శన.

*వరికి బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయలు సాగు చేయాలని రైతులకు సూచన.

*మిశ్రమ పంటలు సాగు చేస్తున్న మహిళా రైతు పున్నమ్మ వ్యవసాయ క్షేత్రం సందర్శన .

*చండూరు మండల వ్యవసాయాధికారి మల్లేష్ .

ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 25: చండూరు మండలంలోని కుమ్మందానిగూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నానో ఎరువుల (నానో యూరియా, నానో డీఏపీ) మరియు పప్పుధాన్యాల సాగుపై ఆత్మ క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.

నానో ఎరువుల ప్రయోజనాలపై అవగాహన

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ మాట్లాడుతూ రైతులకు నానో ఎరువుల ప్రయోజనాల గురించి వివరంగా తెలియజేశారు. సాధారణ యూరియా, డీఏపీ బస్తాలతో పోల్చితే నానో ఎరువులు రవాణా చేయడానికి, నిల్వ చేసుకోవడానికి చాలా తక్కువ స్థలం సరిపోతుందని తెలిపారు.

సాధారణ ఎరువుల కంటే అధిక సామర్థ్యం
సాధారణ యూరియా, డీఏపీలతో పోల్చినప్పుడు నానో ఎరువులతో పంట పోషకాల వినియోగ సామర్థ్యం అధికంగా ఉంటుందని, తద్వారా నేల చౌడుబారడం, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని వివరించారు. కావున రైతు సోదరులు సాధారణ యూరియా, డీఏపీకి బదులుగా సిఫారసు చేసిన మోతాదులో ఈ నానో ఎరువులను వాడితే మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు.

వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి
ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి పంటకు బదులుగా రైతులు కూరగాయలు, పప్పుధాన్యాలు మరియు చిరుధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ లాభం వచ్చే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని కోరారు.

మిశ్రమ పంటలు సాగు చేస్తున్న రైతు పున్నమ్మ క్షేత్ర సందర్శన

అనంతరం వరి పంటకు బదులుగా కొద్ది మొత్తంలో కూరగాయలు, పప్పుధాన్యాల పంటను పండిస్తున్న రైతు పున్నమ్మ గారి క్షేత్రాన్ని సందర్శించారు. ఆమెను అభినందిస్తూ ఇతర రైతులు కూడా ఈ విధంగా మిశ్రమ పంటలను పండించాలని కోరారు. మిశ్రమ పంటలు వేసుకోవడం వల్ల కరువు కాలంలో ఏదో ఒక పంట రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ శంకర, వ్యవసాయ విస్తరణాధికారి పి. పవన్, రైతులు వర్కాల శంకరమ్మ, పున్నమ్మ, శ్రవణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News