ప్రతిపక్షం, ఆగస్టు 07: సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథం అండ్ సన్స్’ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కుటుంబ భావోద్వేగాలు, హాస్యం, అనుబంధాలను సమతూకంగా చూపించిన ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా సూర్య చెప్పిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
“మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు.. గొడవల తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక” అంటూ సూర్య చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధాల విలువను గుర్తుచేసే ఈ మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అలాగే ట్రైలర్‌లోని హాస్య సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. కార్లను చూసి చిన్నపిల్లాడిలా సంబరపడుతున్న సూర్యను చూసి హీరోయిన్ మమిత బైజు “ఇప్పుడెందుకు ‘చంద్రముఖి’లో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావ్?” అని చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.
భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, వినోదాన్ని సమపాళ్లలో మేళవించిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ట్రైలర్‌కు లక్షలాది వ్యూస్ రావడంతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

















