[t4b-ticker]

కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులకు నిజమైన భరోసా

భీమా స్టేజి–2 నుంచి సాగునీటి విడుదల

92 వేల ఎకరాలకు అందనున్న సాగు నీరు

సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు.మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి,శివసేన రెడ్డి

ప్రతిపక్షం, జులై 29,వనపర్తి ప్రతినిధి: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసిందని వనపర్తి,దేవర కద్ర ఎమ్మెల్యేలు.మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి,శివసేన రెడ్డిలు పేర్కొన్నారు.బుధవారం భీమా స్టేజి–2 నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భీమా స్టేజి–2 ద్వారా సుమారు 92 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నదని తెలిపారు.రైతుల పొలాలు పచ్చగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని, అవసరమైన మేరకు నీటి సరఫరా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తోందన్నారు.నేడు భీమా స్టేజి–2 ద్వారా రైతులకు అందుతున్న సాగునీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ఫలితమే అని గుర్తు చేశారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టును కూడా నిర్మించని నాయకులు నేడు సాగునీటి గురించి మాట్లాడడం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే నీళ్లు విడుదలవుతుంటే, వాటి ఘనతను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.రైతుల కోసం శాశ్వత ఆలోచన, అభివృద్ధి దృష్టి, కార్యాచరణ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని, బీఆర్‌ఎస్ పాలనలో ప్రచారం ఎక్కువ – పని తక్కువగా సాగిందని విమర్శించారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాటలు కాదు, చేతల్లో చూపిస్తూ రైతుల కోసం నిరంతరం పనిచేస్తోందన్నారు.రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, సాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వబోమని, ప్రతి ఎకరాకు నీరు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News