ప్రతిపక్షం, ఆగస్టు 21: తెలంగాణలో ‘క్యూర్’ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 40 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. మొత్తం 60,720 దరఖాస్తులు రాగా.. అర్హత సాధించిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు.
దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ నంబర్, మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. దరఖాస్తు స్థితి తెలుసుకునే అధికారిక వెబ్సైట్
దరఖాస్తుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 23లోగా అదే వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. లాటరీకి అర్హత సాధించిన వారి జాబితాను ఆగస్టు 25న ప్రకటించనున్నట్లు సమాచారం.
ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ నిర్వహించి అర్హులైన వారికి ఇళ్లను కేటాయించనున్నారు.





























