[t4b-ticker]

రహానే రికార్డులు తెలుసా?.. కెప్టెన్‌గా అజేయం, క్యాచింగ్‌లోనూ టాప్!

ప్రతిపక్షం, జూలై 31: టీమిండియా మాజీ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఆయన కెరీర్‌లో నెలకొల్పిన అరుదైన రికార్డులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ప్రశాంత స్వభావం, బాధ్యతాయుతమైన ఆటతీరుతో అభిమానుల మనసులు గెలుచుకున్న రహానే, కెప్టెన్‌గా కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నారు.

రహానే నాయకత్వంలో భారత్ 6 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, మరో 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఆయన కెప్టెన్సీలో భారత్ ఒక్క టెస్టు కూడా ఓడిపోకపోవడం విశేషం. అలాగే 3 వన్డే మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించి మూడింటిలోనూ విజయాలు అందించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్‌గా ఒక్క పరాజయం కూడా చవిచూడని భారత ఆటగాళ్లలో రహానే ప్రత్యేక గుర్తింపు పొందారు.

కెప్టెన్సీతో పాటు ఫీల్డింగ్‌లోనూ రహానే తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో క్యాచులు అందుకోవడంలో 68.6 శాతం సామర్థ్యంతో (102 అవకాశాల్లో 70 క్యాచులు) అత్యుత్తమ రికార్డును నమోదు చేశారు. స్లిప్‌లో ఆయన చూపిన చురుకుదనం ఎన్నో కీలక వికెట్లకు కారణమైంది.

బ్యాటింగ్, కెప్టెన్సీ, ఫీల్డింగ్.. మూడు విభాగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్న రహానే, భారత క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆటగాడిగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Spread the love

Related News

Latest News