*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే దసరా పండుగ .
*మునుగోడు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే
ప్రతిపక్షం మునుగోడు అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు పట్టణ మరియు మండల పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరికీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయదశమి (దసరా) పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలతో, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ విజయదుర్గ అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.పండుగ వేళ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరి మధ్య బంధుత్వాలు, స్నేహభావాలు మరింత బలోపేతం కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు.ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి విజయపథంలో ముందుకు సాగాలని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నారు.




























