ఏబీవీపీ నుంచి పలువురు కార్యకర్తల చేరిక
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 17: తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగంలోకి ఏబీవీపీకి చెందిన పలువురు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ బట్టి అజయ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎండీ జునైద్ ఆధ్వర్యంలో రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు.
మెదక్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తలకు నాయకులు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మెదక్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కేవల్ నందకిషోర్, జిల్లా ఎంబీసీ అధ్యక్షుడు ఇప్ప రమేష్, మెదక్ టౌన్ బీసీ వింగ్ అధ్యక్షుడు కరాటే శ్రీనివాస్, టౌన్ యువజన విభాగం అధ్యక్షుడు చౌదరి భాను, మెదక్ మండల యువజన విభాగం అధ్యక్షుడు కరాటే ప్రేమ్, మక్త భూపతిపూర్ గ్రామ అధ్యక్షుడు వడ్డే రమేష్, హొలియాద్రి ఏగుండ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు






























