కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 16: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కేసీఆర్ పేరు మీద అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఏడుపాయల నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు పాదయాత్రగా బయలుదేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి, తిరిగి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయ చైర్మన్ బాలాగౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కల్వకుంట అందే కొండల్ రెడ్డి, శంకరంపేట మండల ముఖ్య నాయకులు, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, పాపన్నపేట బీఆర్ఎస్వీ అధ్యక్షులు, కూర్తివాడ మాజీ సర్పంచ్ కొత్తూరు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ మెదక్ మండల అధ్యక్షులు గంజి నవీన్, నిజాంపేట బీఆర్ఎస్వీ అధ్యక్షులు మావురం రాజు తదితరులు పాల్గొన్నారు.అలాగే యువజన నాయకులు వినయ్, రాజు, సాయి పటేల్, భానుచందర్, ప్రవీణ్, విల్సన్, నాగేష్, సల్మాన్, వంశీ, సత్యనారాయణ గౌడ్, శేఖర్, స్వామి, కనకరాజు, రమేష్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.



























