ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య.

*దళారులను నమ్మి మోసపోవద్దు.. వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి.

*రైతులు మద్దతు ధరకు అమ్మాలని సూచన

ప్రతిపక్షం చౌటుప్పల్ అక్టోబర్ 27: రైతు సంక్షేసంక్షేమమేభుత్వ ధ్యేయమని, దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

ఈరోజు చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు, పెద్ద కొండూరు, మసీదు గూడెం, గుండ్ల బావి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుకు మద్దతు ధర క్వింటాల్కు 2416 ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు మూడు రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు, ఎలినీనో ప్రభావం తో నీటి ఎద్దడి కారణంగా రైతులు ప్రత్యామ్యామ పంటలపై దృష్టి సారించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు,APM యాదయ్య, సర్పంచ్లు తిగుళ్ళ చంద్రయ్య, మర్రి వంశీధర్ రెడ్డి,గుండెబోయిన శిరీష ఇస్తారీ, నందగిరీ వెంకటేశం, ఉపసర్పంచ్ లు గడ్డం సత్తయ్య, పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి,పల్చం జయమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాటేపల్లి నవీన్ గౌడ్, మర్రి రాజి రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు నల్ల నరేందర్ రెడ్డి, బొబ్బిల్లా రాజేందర్, జక్కిడి వెంకట్ రెడ్డి, A E O లు సోనీ, వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు శ్రీశైలం, ధనలక్ష్మి,నాయకులు బక్క శ్రీనాథ్, బక్క మల్లయ్య, తిగుళ్ళ పెంటయ్య వాకిటి భూపాల్ రెడ్డి, మర్రి శ్యామ్ సుందర్ రెడ్డి,గూడూరు థాను రెడ్డి, గూడూరు నవీన్ రెడ్డి, గుండెబోయిన ఐలయ్య, ముప్పిడి శ్రీనివాస్,నందిగిరి పరమేశ, భీమిడి మల్లారెడ్డి, పల్లె వెంకటేష్, తిగుళ్ళ బాలరాజు, పల్చం సాయి, ఉదరీ రమేష్ శివ మహిళా సంఘాల నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News