యాసంగిలో వరి సాగు తగ్గించాలి

ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి: మంత్రి తుమ్మల

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, అక్టోబర్ 12: ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో నీటి లభ్యత తగ్గే అవకాశాల దృష్ట్యా వరి సాగును తగ్గించి, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.మెదక్ మండలం రాజ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు నష్టాలు కలగకుండా స్వల్పకాలిక పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. భూగర్భ జలాలు, నీటి వనరుల లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు సూచించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ డివిజన్ ఏడీఏ అమీనా బి, హెచ్‌ఓ రచన, ఏఈఓ ప్రశాంత్, రాజ్‌పల్లి, వెంకటాపూర్ సర్పంచులు నారాయణ, యాదగిరిగౌడ్, రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News