లబ్ధిదారులకు పెన్షన్ మంజూరీ పత్రాలు అందజేసిన ఇంచార్జి మంత్రి సీతక్క
ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, నవంబర్ 20 : ముప్కాల్ మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షన్ హాల్లో శుక్రవారం చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు రూ.21.91 కోట్ల రుణాలను చెక్కు రూపంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఓ సాయన్న తదితరులు పాల్గొన్నారు.





























