*భూ భారతి పెండింగ్ ఫైళ్లకు మోక్షం – త్వరితగతిన పరిష్కరించాలని చండూరు ఆర్డీఓ ఆదేశం
*నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం – పాత పోర్టల్ లో పెండింగ్ ఫైళ్లపై ఆరా
*రీ-సర్వే ఫారం-1, 2 సమర్పణపై చర్చ – మీ సేవ ధ్రువీకరణ పత్రాల పురోగతిపై సమీక్ష
*ప్రజలకు సకాలంలో రెవెన్యూ సేవలు అందించాలి – చండూరు ఆర్డీఓ వందనం శ్రీదేవి
ప్రతిపక్షం నాంపల్లి, అక్టోబర్ 24 : భూ భారతి పాత పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని చండూరు ఆర్డీవో వందనం శ్రీదేవి అధికారులకు సూచించారు. శనివారం నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, కార్యాలయ సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పాలన అధికారుల (జీపీఓలు)తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూ భారతి పాత పోర్టల్ లో అన్ని లాగిన్లలో పెండింగ్ లో ఉన్న ఫైళ్ల వివరాలను సమీక్షించారు. రీ-సర్వేకు సంబంధించిన ఫారాలు-1, 2 సమర్పణతో పాటు మీ సేవ ద్వారా జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల దరఖాస్తుల పురోగతిపై చర్చించారు.పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భూ భారతి దరఖాస్తుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, ప్రతి ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓ స్పష్టం చేశారు.





























