ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్ పంపిణీ.

*ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలి.

*అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కురుపాటి రఘునమ్మ .

ప్రతిపక్షం – చండూరు, అక్టోబర్ 28: మండలంలోని గుండ్రపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు రెండవ జత స్కూల్ యూనిఫామ్‌తో పాటు షూస్, సాక్స్‌లను బుధవారం ఘనంగా పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రమేష్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కురుపాటి రఘునమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు వీటిని అందజేశారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని రఘునమ్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. సత్యవతి, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News