రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

ప్రజా పాలన పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

ప్రతిపక్షం.హుస్నాబాద్: అక్టోబర్ 12: హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న డీఈ కార్యాలయం, సబ్‌స్టేషన్ ఎదుట నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

– గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించామని తెలిపారు.

– రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు.

– ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

– ప్రజా పాలన పేరుతో గొప్పలు చెప్పుకోవడం కాదు.. రైతులకు అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా అందించి వారి సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.

– వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

– విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

– రైతుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని శ్రీ వొడితల సతీష్ కుమార్

స్పష్టం చేశారు.

ఈ ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని విద్యుత్ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News