[t4b-ticker]

చండూరు స్వాగత్ వైన్స్‌లో కల్తీ మద్యం రాకెట్ బట్టబయలు

కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలతో చెలగాటం.

స్వాగత్ వైన్స్‌పై వెంటనే సమగ్ర విచారణ జరిపి లైసెన్స్ రద్దు చేయాలి.

కల్తీ దందాకు పాల్పడుతున్న నిర్వాహకులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆశయాలకు తూట్లు.

కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.

ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 17: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నిర్మూలించి, మద్యం మహమ్మారి నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలను కాపాడాలనే సంకల్పంతో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్న తరుణంలో, చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని స్వాగత్ వైన్స్ నిర్వాహకులు
ఆయన ఆశయాలకు గండి కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి.చండూరులోని స్వాగత్ వైన్స్‌లో గత కొంతకాలంగా కల్తీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని, ప్రాణాంతకమైన కల్తీ మద్యాన్ని ఒరిజినల్ బాటిళ్లలో పోసి అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది.ఇందులో భాగంగానే వాటర్ బాటిళ్లపై ఫేక్ QR కోడ్ స్టిక్కర్లు అంటించి కల్తీ మద్యాన్ని ఏ మాత్రం అనుమానం రాకుండా విక్రయిస్తున్నారు. ఇంకా దారుణంగా ప్రభుత్వ మద్యం QR కోడ్ స్టిక్కర్లను కూడా అక్రమంగా వాడుతున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
*సిబ్బంది అరాచకం.
కల్తీపై ప్రశ్నించిన వినియోగదారులతో వైన్స్ సిబ్బంది తీవ్ర దురుసుగా, అహంకారంగా ప్రవర్తిస్తున్నారు. నిలదీసిన వారిని భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు, స్థానిక పోలీసులతో కుమ్మక్కై ఎదురు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు భయంతో ఎవరూ నోరు తెరవడం లేదు.
*అధికారుల నిర్లక్ష్యం.
ఈ సాయం మాసం జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు కేవలం పైపై మెరుగులకే పరిమితమయ్యాయని, కోట్ల రూపాయల బిల్లులు మాత్రమే తీసి వెళుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేమి, లాలూచీ వల్లే వైన్స్ నిర్వాహకులు ఇంత ధైర్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
*ప్రజల ఆవేదన

ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉంది. ఏ సమయంలో ఏ బాటిల్ తాగితే ఏ రోగం వస్తుందో, ఎవరి ప్రాణాలు గాల్లో కలుస్తాయో తెలియడం లేదు. లైసెన్సులు ఇచ్చింది వ్యాపారం చేసుకోడానికి లేక ప్రజలను చంపడానికా?” అంటూ మున్సిపాలిటీ వాసులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ కమీషనర్, SP వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చండూరు ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Spread the love

Related News

Latest News