[t4b-ticker]

‘గంగోత్రి’ సమయంలో వైజాగ్ రోడ్లపై నడిచినా ఎవరూ గుర్తుపట్టేవారు కాదు: అల్లు అర్జున్

ప్రతిపక్షం, ఆగస్టు 09: విశాఖపట్నంతో తనకు ఎప్పటి నుంచో ప్రత్యేక అనుబంధం ఉందని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. తన తొలి సినిమా ‘గంగోత్రి’ సమయంలో వైజాగ్ రోడ్లపై స్వేచ్ఛగా తిరిగినా ఎవరూ తనను గుర్తుపట్టేవారు కాదని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తనకు అలాంటి పరిస్థితి లేదని.. రోడ్లపై సాధారణంగా నడవడం కూడా కష్టంగా మారిందని చెప్పారు.

విశాఖపట్నంలో సినిమా షూటింగ్‌ సమయంలో తన పేరు మీద ఒక థియేటర్ ఏర్పాటవుతుందని అసలు ఊహించలేదని అల్లు అర్జున్ అన్నారు. నగరంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ ఎంతో ప్రత్యేకంగా ఉందని తెలిపారు.

ఇక రేపటి నుంచి ‘రాకా’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు వచ్చిన కొందరు అభిమానుల కోరిక మేరకు వారితో కలిసి ఫొటోలు దిగారు. అభిమానులతో అల్లు అర్జున్ ఆత్మీయంగా ముచ్చటించడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

Spread the love

Related News

Latest News