[t4b-ticker]

నూతన ఆప్ వ్యవస్థ ద్వారానే ఎరువుల విక్రయాలు

ప్రతిపక్షం, వికారాబాద్, ఆగస్టు 04: భారత ప్రభుత్వ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాల కోసం నూతన యాప్ వ్యవస్థ ఏర్పాటు చేసిందని, ఆ ఆప్ ద్వారానే విక్రయాలు జరుగుతాయని తాండూరు డివిజన్ వ్యవసాయ అధికారి అరుణ తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ…. ఇప్పటివరకు ఉన్న ఎరువుల విక్రయాలు నేటితో నిలిపివేయబడతాయన్నారు. రేపటినుండి అప్ గ్రేట్ చేయబడిన కొత్త ఆప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరగనున్నాయన్నారు. ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారానే రైతులు తమ ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో సులభంగా ఎరువులను పొందాలన్నారు. సంబంధిత ఎరువుల డీలర్లు దుకాణం వద్ద రైతులకు ఎఫ్ ఎఫ్ ఎస్ వినియోగంపై సహాయం అందించేందుకు స్వచ్ఛంద సేవకులను అందుబాటులో ఉంచాలన్నారు. స్వచ్ఛంద సేవకులు బుకింగ్ ప్రక్రియ ధ్రువీకరణ మరియు ఎరువుల కొలుగోలు ప్రక్రియలో రైతులకు సహకారం అందిస్తారన్నారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను కలిసి నివృత్తి చేసుకోవాలన్నారు.

Spread the love

Related News

Latest News