ప్రతిపక్షం, జూలై 30: హీరోయిన్ త్రిష చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహారయాత్రను ఆస్వాదిస్తున్న ఆమె స్టైలిష్ లుక్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటికి “ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండటం ఒక ఎంపిక.. అదే ఎంచుకోండి” అంటూ క్యాప్షన్ ఇవ్వడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
కొంతకాలంగా తమిళనాడు సీఎం విజయ్‌తో త్రిషకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం, విమర్శల నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదనే సంకేతాన్ని త్రిష పరోక్షంగా ఇచ్చినట్లుగా అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే త్రిష తన పోస్టులో ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు. వ్యక్తిగత జీవితంపై వస్తున్న ప్రచారంపై ఆమె ఎలాంటి అధికారిక స్పందన కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ ఒక్క క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల మధ్య విస్తృత చర్చకు దారితీసింది.

















