తెలంగాణ రక్షణ సేనకు పార్లమెంట్ ఇన్‌చార్జీల నియామకం

మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జిగా భవానీ వేముల

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్ జులై 28: తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా రాష్ట్రంలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు.

నియమితులైన వారిలో మహబూబాబాద్‌కు బోడ అనిల్ కుమార్, వరంగల్‌కు వీర బిక్షపతి, నిజామాబాద్‌కు ఎస్.ఎ. అలీం, మల్కాజిగిరికి వేముల భవాని, పెద్దపల్లికి తిప్పరపు సారయ్య, కరీంనగర్‌కు లింగంపల్లి నాగరాజు, నల్గొండకు ధీరవత్ సరిత, జహీరాబాద్‌కు నెమలికొండ వేణు మాధవ్, ఆదిలాబాద్‌కు మాడవి బాబురావును నియమించినట్లు పార్టీ ప్రకటించింది.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా పనిచేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కొత్తగా నియమితులైన ఇన్‌చార్జీలు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News