*చొప్పరి వారి గూడెం పాలకవర్గం ఆధ్వర్యంలో ఉత్తమ కార్యదర్శి జి.సంధ్యకు సత్కారం
*చొప్పరి వారి గూడెం పంచాయతీ కార్యదర్శికి జిల్లా స్థాయి గుర్తింపు – పాలకవర్గం అభినందన.
ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 25: జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డు అందుకున్న జి. సంధ్య గారిని చొప్పరి వారి గూడెం గ్రామ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. చండూరు మండలంలోని చొప్పరి వారి గూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ, పంచాయతీ అభివృద్ధికి, పారిశుద్ధ్య నిర్వహణలో, ప్రభుత్వ పథకాల అమలులో విశేష కృషి చేసినందుకు గాను జిల్లా స్థాయిలో ఉత్తమ కార్యదర్శిగా సంధ్య ఎంపికై అవార్డు అందుకున్నారు.
గ్రామ సర్పంచ్ చప్పరి వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ కార్యదర్శిగా అవార్డు అందుకున్న సంధ్య ను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి అభినందించారు. గ్రామ అభివృద్ధి కోసం ఆమె చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సర్పంచ్ కొనియాడారు. ఈ సందర్భంగా చొప్పరి వారి గూడెం సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆమెను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి అభినందించారు. గ్రామ అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో… సర్పంచ్ జాల వెంకన్న, ఉప సర్పంచ్ చొప్పరి మాలతి భాస్కర్, వార్డు మెంబర్లు చొప్పరి పూజ, చొప్పరి శివ, గ్రామ ప్రజలు చొప్పరి లింగస్వామి, రాములు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.





























