భూముల రీ-సర్వే పకడ్బందీగా జరగాలి.

*భూముల రీ-సర్వేలో అలసత్వం వద్దు – పకడ్బందీగా నిర్వహించాలి.

*నల్గొండ జిల్లాలో 55 గ్రామాల్లో రీ-సర్వే షురూ – 20 గ్రామాల్లో 9(2) నోటీసులు జారీ.

*కలెక్టర్లతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ – రైతులకు అవగాహన, రికార్డుల్లో తప్పులు లేకుండా చర్యలు.

*సరిహద్దులు, విస్తీర్ణం క్షేత్రస్థాయిలో తేల్చండి – వివాదాల పరిష్కారానికి నిబంధనలు పాటించాలని ఆదేశం.

*అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ – సర్వే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి సమీక్ష

*రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ కీలక ఆదేశం.

ప్రతిపక్షం నల్గొండ, అక్టోబర్ 24 : భూముల రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర భూ పరిపాలన కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ కలెక్టర్లకు సూచించారు.శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో భూ పరిపాలన కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లా వివరాలను తెలియజేస్తూ జిల్లాలో 55 గ్రామాలలో రీ-సర్వే మొదలుపెట్టామని, 20 గ్రామాలలో 9(2) నోటీసులు జారీ చేశామని, వాటిపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తున్నామని, ఫిర్యాదులు అందిన భూములకు సంబంధించి మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని వివరించారు.

*కమిషనర్ కీలక సూచనలు:
భూ పరిపాలన కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ భూముల సరిహద్దులు, విస్తీర్ణం, భూ రికార్డుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డుల్లో ఉన్న వివరాలతో సరిపోల్చాలని సూచించారు.రీ-సర్వే సందర్భంగా భూ యజమానుల వివరాలు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, సరిహద్దులకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలని, భూములకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు లేదా వివాదాలు తలెత్తితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.భూ రీ-సర్వే ప్రక్రియపై రైతులు, భూ యజమానులకు అవగాహన కల్పించాలని, అలాగే రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేసి, భూ రికార్డుల్లో తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సర్వే డిప్యూటీ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.

Spread the love

Related News

Latest News