•నన్నయ్య ఆది కవి అయితే మొల్ల ఆది కవయిత్రి
•తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం
•అచ్చ తెలుగుతో రామాయణం రచించిన ధీర వనిత
•నవంబర్ 11న జరిగే మొల్ల విగ్రహ భూమి పూజకు కుమ్మరులంతా పెద్ద ఎత్తున తరలిరావాలి
•కుమ్మరులకు పిలుపునిచ్చిన మాజి కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం
వనపర్తి ప్రతినిధి, నవంబర్ 04 ప్రతిపక్షం: తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ తెలుగుజాతి గర్వించదగ్గ రచయిత్రి అని మాజి కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం కొనియాడారు. బుధవారం వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం మండలంలో సంఘం అధ్యక్షులు, యువజన అధ్యక్షుల ఆధ్వర్యంలో కుమ్మరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల (నవంబర్ )11న వనపర్తి జిల్లా కేంద్రంలో మన కుల ఆడపడుచు,కవయిత్రి మొల్లమాంబ విగ్రహ భూమిపూజ కార్యక్రమం ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా నిర్వహించబడుతుందన్నారు.తెలుగుజాతికి విలువైన రత్నం మొల్ల అని,నన్నయ్య ఆదికవి అయితే ఆది కవయిత్రి మొల్ల అని కీర్తించారు. తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రి మొల్లకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహా కవయిత్రి మొల్ల మన తెలుగు రచయిత కావడం మన అదృష్టమన్నారు.నాటి కాలంలో రాజుల ఆస్థానాల అండ లేకుండా ఒక కావ్యం రాయలేరని, కాని మొల్ల ఏ రాజాస్థానం అండ లేకుండా అచ్చ తెలుగులో రామాయణం రచించి ఆ శ్రీరాముడికే అంకితమిచ్చారని ప్రశంసించారు.
ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడ్డాయంటే దానికి కారణం రామాయణం ఒక్కటేనని పేర్కొన్నారు.రామాయణాన్ని అచ్చ తెలుగులో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అనువదించిన మహా కవయిత్రి మొల్ల విగ్రహ భూమి పూజకు వనపర్తి జిల్లా పరిధిలోని కుమ్మర కుటుంబ సభ్యులందరూ, కుల పెద్దలు, యువత, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని మన కుమ్మర్ల ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలొ పెద్దలు బొడ్డుపల్లి మన్యం,నాయకులు గోవిందు, మండల అధ్యక్షులు శేఖర్, యూత్ అధ్యక్షులు సురేష్, నర్సింహా,ఇతర కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.





























