కస్తాల గ్రామంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

*రామాలయం గుడి వద్ద కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారు.

*మూడవరోజు భక్తులకు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం.

ప్రతిపక్షం చండూరు, అక్టోబర్ 13: చండూరు మండలం కస్తాల గ్రామంలోని చారిత్రక రామాలయ ప్రాంగణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి మూడవరోజు అవతారం అన్నపూర్ణా దేవి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చింది. అన్నం పెట్టే తల్లిగా భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని భక్తులుదర్శించుకున్నారు.ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, ప్రత్యేక పుష్పాలంకరణ చేసి, లలితా సహస్రనామ పారాయణం గావించారు. అనంతరం అన్నపూర్ణా అష్టోత్తరం చదివి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చండూరు మండల ఎస్‌ఎస్‌సిఎస్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కట్ట బిక్షం – పద్మ దంపతులు మరియు బొమ్మరబోయిన సప్తగిరి – సంధ్య దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Related News

Latest News