ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

  • అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
  • కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం
  • జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

ప్రతిపక్షం, యూసుఫ్‌గూడ, నవంబర్ 22: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారులు డీసీ సురేష్ కుమార్, అరుణ్ కుమార్, శ్రీనివాస్, ఐశ్వర్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related News