[t4b-ticker]

జెన్-జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ ఫోకస్.. 100 నగరాల్లో భాగవత్ వర్చువల్ సంభాషణ

ప్రతిపక్షం, ఆగస్టు 05: పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై యువతలో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో విద్యార్థులతో మరింత మమేకం కావాలని ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) నిర్ణయించినట్లు సమాచారం. ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన సంఘ్, కొత్త తరం విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణకు ప్రాధాన్యం ఇస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 6న దేశంలోని 100 నగరాల్లో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల జెన్-జీ విద్యార్థులతో ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ వర్చువల్‌గా సంభాషించనున్నారు. విద్యార్థుల అభిప్రాయాలు, ఆందోళనలు తెలుసుకోవడంతో పాటు వారితో ఆలోచనలు పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.

యువతకు ఎదురవుతున్న సవాళ్లు, విద్య, ఉపాధి, సామాజిక బాధ్యతల వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం, విద్యార్థుల మధ్య ఏర్పడిన భావజాల అంతరాన్ని తగ్గించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతతో నిరంతర సంభాషణ ద్వారా వారి విశ్వాసాన్ని పెంపొందించే దిశగా ఆర్‌ఎస్‌ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News