ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 06: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ని పురస్కరించుకొని పెద్ద శంకరంపేట్ తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అందరికి ఆదర్శప్రాయులు అన్నారు ఈ కార్యక్రమం లో తాసిల్దార్ నారాయణ, ఎంపీడీవో క్రాంతి కుమార్, ఆర్ ఐ నాగరాజు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


















