[t4b-ticker]

పార్లమెంట్‌లో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. వందేమాతరం బిల్లుకూ ఆమోదం

ప్రతిపక్షం, జూలై 29: పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విస్తృత చర్చ అనంతరం బుధవారం సభ ఆమోదం లభించింది.

ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, అభ్యర్థుల భవిష్యత్తును కాపాడడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇక మరో కీలక పరిణామంగా వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో రెండు కీలక బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం విశేషంగా మారింది. యాంటీ పేపర్ లీక్ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా పరీక్షల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రం భావిస్తోంది.

Spread the love

Related News

Latest News