ప్రతిపక్షం, జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (54) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత ఆదివారం నుంచి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ఉదయం ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి తరలించనున్నారు. రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





























