[t4b-ticker]

రాయన్ పల్లి ప్రాజెక్టు వంతెన పునర్నిర్మాణం

రూ.2.30 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదన

వంతెన వద్ద అధికారులు భద్రత చర్యలు చేపట్టాలి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 31: రాయన్ పల్లి ప్రాజెక్టు వంతెన పునర్నిర్మాణం త్వరలో జరుగుతుందని దీనికోసం 2.30 కోట్ల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు వంతెన వద్ద ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రాయన్ పల్లి చెరువు పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అయినా సూచించారు గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా వంతెన పూర్తిగా దెబ్బతినడంతో గ్రామ ప్రజలు, రైతులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు .వంతెన పునర్నిర్మాణానికి సంబంధించి రూ.2.30 కోట్ల అంచనా వ్యయాన్ని సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం లభించేలా తాను నిరంతరం సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ నిధుల మంజూరు కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే, కొత్త వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే తాత్కాలిక మరమ్మతులు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.అదేవిధంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వంతెనలు, కాలువలు, వాగులు, చెరువుల పరిస్థితిని సమీక్షించి, వర్షాకాలంలో ప్రమాదం ఏర్పడే అవకాశమున్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు.వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News