[t4b-ticker]

2027 నుంచి దేశవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లు.. అత్యవసర వైద్య సేవలకు కేంద్రం కీలక నిర్ణయం

ప్రతిపక్షం, ఆగస్టు 04: దేశంలోని గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బైక్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టనుంది. 2027 అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్–1989లో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బైక్ అంబులెన్స్‌ల రూపకల్పన, రిజిస్ట్రేషన్, తనిఖీలు, నిర్వహణ, అత్యవసర వైద్య పరికరాల ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రమాణాలను రూపొందించనుంది.

రోడ్లు సరిగా లేని ప్రాంతాలు, ఇరుకైన వీధులు, కొండ ప్రాంతాల్లో సాధారణ అంబులెన్స్‌లు చేరుకోలేని పరిస్థితుల్లో బైక్ అంబులెన్స్‌లు వేగంగా రోగులను చేరుకుని ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు అవసరమైతే సమీప ఆసుపత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువయ్యేలా చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Spread the love

Related News

Latest News