*రాఖీ అంటే మణికట్టుకు కట్టే దారం కాదు…మనసులను కలిపే ప్రేమ బంధం.”
*జీవితంలో ఏన్నో బంధాలు వస్తుంటాయి…కానీ తోడబుట్టినా బంధం గొప్పది .
*అన్నాచెల్లెళ్ల బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే.”
*రాఖీ దారం చిన్నదే అయినా, జీవితాంతం నిలిచే ప్రేమను,నమ్మకాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది .
*మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .
ప్రతి పక్షం మునుగోడు ఆగస్టు 28: రాఖీ పండుగ సందర్భంగా మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన సోదరి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టి, పరస్పరం ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు . అన్నాచెల్లెళ్ల బంధం అంటే కేవలం రక్త సంబంధం కాదు…
ఆపదలో అండగా నిలిచే ఆత్మీయత,కష్టాల్లో ధైర్యం చెప్పే నమ్మకం,సంతోషాల్లో మనసారా నవ్వించే అనుబంధం. జీవితంలో ఏన్నో బంధాలు వస్తుంటాయి…కానీ చిన్ననాటి జ్ఞాపకాలతో, ప్రేమతో, అల్లరితో నిండిన అన్నాచెల్లెళ్ల బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే.”
రాఖీ దారం చిన్నదే అయినా,అది కట్టేది మాత్రం జీవితాంతం నిలిచే ప్రేమను,నమ్మకాన్ని, అనుబంధాన్ని పెంచుతుంది .రాఖీ అంటే మణికట్టుకు కట్టే దారం కాదు…మనసులను కలిపే ప్రేమ బంధం.” అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ…అన్నాచెల్లెళ్ల బంధం చిరకాలం వర్ధిల్లాలి అని అన్నారు .రాఖీ పండుగ సందర్భంగా సోదరి తనకు రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబంలో అన్నాచెల్లెళ్ల బంధం ఇలాగే ప్రేమానురాగాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.





























